సీపీఎం ఖాతా తెరవలే.. పోటీ చేసిన 17 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు

సీపీఎం ఖాతా తెరవలే.. పోటీ చేసిన 17 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ప్రభావం చూపలేక పోయింది. కొన్నేండ్లుగా సీపీఐ, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు పోతున్న ఈ పార్టీ ఈసారి మాత్రం ఒంటరిగా బరిలో దిగింది. 17 స్థానాల్లో పోటీ చేసి గెలుపు ఖాతా తెరువలేక పోయింది. కనీసం ఎక్కడా కూడా ఆ పార్టీ డిపాజిట్​ దక్కించుకోలేకపోయింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేవలం 5308 ఓట్లు పొందగలిగారు. మిర్యాలగూడ నుంచి బరిలోకి దిగిన జూలకంటి రంగారెడ్డి 3234 ఓట్లు సాధించారు.

  మధిరలో పోటీ చేసిన పాలడుగు భాస్కర్‌‌‌‌‌‌‌‌ 6575 ఓట్లు పొందారు. కోదాడ నుంచి పోటీ చేసిన మిట్టపల్లి సైదులు 1195 ఓట్లు, మునుగోడులో పోటీ చేసిన దోనూరి నర్సిరెడ్డి 2351 ఓట్లు మాత్రమే పొందారు. వైరాలో పోటీ ఉన్న బూక్య వీరభద్రం 4439ఓట్లు సాధించారు. ఇబ్రహీంపట్నంలో బరిలో నిలిచిన పగడాల యాదయ్యకు 3948 ఓట్లు వచ్చాయి. ముషీరాబాద్‌‌‌‌‌‌‌‌ లో పోటీ చేసిన మద్దెల దశరథం 835 ఓట్లు మాత్రమే పొదగలిగారు. ఇక్కడ నోటాకు 1332 ఓట్లు రావడం గమనార్హం.