మీ నిర్వాకంతో జీతాలకూ అప్పు తేవాల్సిన పరిస్థితి: భట్టి

మీ నిర్వాకంతో జీతాలకూ అప్పు తేవాల్సిన పరిస్థితి: భట్టి
  • రూ.7.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు: భట్టి
  • రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వ నాశనం చేసింది
  • ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నం
  • పదేండ్లలో ఒక్క గ్రూప్ 1 పోస్టూ భర్తీ చేయలే
  • వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామన్న ఆర్థిక మంత్రి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో పెండింగ్ బిల్స్ అన్నీ కలుపుకొని రూ.7,11,911 కోట్ల అప్పు ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త సర్కారు వచ్చాక అప్పు చేయకపోతే జీతాలివ్వలేని దుస్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 

‘‘బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టాం. బడ్జెట్​లో పెట్టి న ప్రతిపైసా ప్రజలకు ఖర్చు చేస్తాం. అసెంబ్లీ లో ఆదాయ, వ్యయాల‌‌‌‌‌‌‌‌ను అంచ‌‌‌‌‌‌‌‌నా వేసి వాస్త విక బ‌‌‌‌‌‌‌‌డ్జెట్ పెట్టాం. గతేడాది సుమారు 3 లక్ష ల కోట్లతో బడ్జెట్ పెడితే, ఈ సారి దాన్ని రూ.2.75 లక్షల కోట్లకు కుదించాం’’అని భట్టి తెలిపారు.

బీఆర్ఎస్ పాలనలో2.62 లక్షల కోట్లు ఖర్చు చేయలే

2014 నుంచి 2023 దాకా రూ.14,87,834 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా, దాంట్లో ఖ‌‌‌‌‌‌‌‌ర్చు చేసింది రూ.12,25,326 కోట్లు మాత్రమే అని భట్టి విక్ర మార్క పేర్కొన్నారు. మరో రూ.2,62,518 కోట్లు ఖ‌‌‌‌‌‌‌‌ర్చు పెట్టలేదన్నారు. ‘‘2023–24 వార్షిక బడ్జె ట్​లోనూ రూ.70 వేల కోట్ల వ్యత్యాసం ఉంది. బడ్జెట్​లో నిధులు కేటాయించి రాబడి రాకుండా ఎత్తేయడంతో పేద, బడుగు బలహీన వర్గాల కోసం అలాట్ చేసిన స్కీమ్​లకు నిధుల్లో కోతపడు తున్నది. ఆదాయం ఉన్నా.. లేకున్నా.. గత ప్రభుత్వం 20% బడ్జెట్ అంచనాలు పెంచి ప్రతిపాదించింది. ఈసారి అలా చేయదలుచుకోలేదు. బడ్జెట్ దాదాపు 5% అటూ.. ఇటూ అంతా ఖర్చు చేస్తాం’’అని భట్టి స్పష్టం చేశారు. గత సర్కారు హయాంలో ఆదాయం బాగున్నా, బ‌‌‌‌‌‌‌‌డ్జెట్​లో పెట్టిన ఖ‌‌‌‌‌‌‌‌ర్చు 79% మాత్రమే ఉండ‌‌‌‌‌‌‌‌టం బాధాకరమని భట్టి పేర్కొన్నారు.

బడ్జెట్​లో పెట్టిన దానికంటేఎక్కువే ఖర్చు  

బడ్జెట్​ను పెంచి చూపించడం ద్వారా గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు రుణాలు ఇవ్వలేదని, దళితబంధు, మూడెకరాల భూమి ఇవ్వలేకపోయారని భట్టి విమర్శించారు. చాలా రాష్ట్రాలు బడ్జెట్​లో పెట్టిన దానికంటే ఎక్కువ ఖర్చు చేశాయని గుర్తుచేశారు. ‘‘రాజస్థాన్​ 116%, కర్నాటక 113%, మధ్యప్రదేశ్ 110%, కేరళ వందశాతం నిధులు ఖర్చు పెట్టాయి. కొత్త గా తీసుకునే అప్పులు ఎఫ్ఆర్​బీఎంకు లోబడి ఉంటాయి’’అని ఆయన తెలిపారు.

టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేశాం

పదేండ్లలో ఒక్క గ్రూప్ 1 పోస్టు నింపలేదని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. లక్షలాది మంది నిరుద్యోగులు గడ్డాలు, మీసాలు పెంచుకొని గ్రూప్ 1 పరీక్ష కోసం వెయిట్ చేశారని పేర్కొన్నారు. ‘‘టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పాం.. చేశాం. అదనపు సిబ్బందినీ ఇచ్చాం. రూ.40 కోట్లు కేటాయించాం. రాష్ట్రంలో ఉద్యోగ జాతర మొదలైంది. దీంట్లో ప్రతిపక్ష నేతలూ పాల్గొనాలి. గ్రూప్ 1లో 503 పోస్టులకు అదనంగా.. మరో 64 పోస్టులు పెంచినం. ఇప్పటికే నర్సింగ్​లో 6,956 మందికి, సింగరేణిలో 412 మందికి, 13వేల మంది కానిస్టేబుల్స్​కు నియామక పత్రా లు ఇచ్చాం. గురువారం కూడా గురుకులాల్లో ఎంప్లాయీస్ కోసం మరో 2వేల మందికి నియామక పత్రాలిచ్చాం”అని ఆయన తెలిపారు. ఉద్యోగాల జాతర మొదలుపెట్టామని, ఇది ఆరంభం మాత్రమేనని వెల్లడించారు. 

ఆరు గ్యారంటీలు గాలికి వదిలేయలే..

మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలకు కట్టుబ డి ఉన్నామని, వాటిని గాలికి వదిలేయలేదని భట్టి చెప్పారు. వాటి అమలు కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్​లో రూ.53,196 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. రైతు భరోసాకు రూ.15వేల కోట్లు, చేయూతకు రూ.14వేల కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు రూ.7,740 కోట్లు ప్రతిపాదించామన్నారు. క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తులకు అనుగుణంగా నిధులు కేటాయించామని, అవసరమైతే హడ్కో, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మరిన్ని నిధులు సమకూరుస్తామని చెప్పారు. మహాలక్ష్మీ స్కీమ్ కోసం ఆర్టీసీకి ప్రతినెలా రూ.300 కోట్లు ఇస్తున్నామన్నారు. పీఆర్సీ కమిటీ వేశామని, ఆ కమిటీ రిపోర్టుకు అనుగుణంగా ముందుకు పోతామన్నారు. ఓల్డ్ సిటీలో మెట్రో పనులపై సీఎం రివ్యూ చేశారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు ఇస్తం 

ఇందిరమ్మ ఇండ్లు 3 లక్షలు ఇస్తామని చెప్పామని, వాటిని5 లక్షలకు పెంచుతామని భట్టి తెలిపారు. ఆరు గ్యారంటీల అమ‌లు, ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, ఉద్యోగాల భ‌ర్తీకి కావాల్సిన నిధులు కేటాయిస్తామని తెలిపారు.ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, కొన్ని రోజుల్లోనే నోటిఫికేష‌న్ల ప్రక్రియ మొద‌లవుతుందని చెప్పారు. డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల అలాట్ మెంట్ పై త్వర‌లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ధరణిపై కమిటీ వేశామని, నివేదిక వచ్చిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. డ్వాక్రా మహిళలకువడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు.