అచ్చంపేట నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

అచ్చంపేట నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

అచ్చంపేట, వెలుగు: నియోజకవర్గంలో సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. బల్మూర్  మండలం గట్టు తుమ్మెన్  గ్రామంలో సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో శంకుస్థాపన పనులు, సభ ఏర్పాట్లను విద్యుత్  శాఖ అధికారులతో కలిసి కలెక్టర్  బదావత్  సంతోష్  పరిశీలించారు. డిప్యూటీ సీఎం ఉదయం 9 గంటలకు ప్రజా భవన్  నుంచి బయల్దేరుతారని, 11 గంటలకు గట్టు తుమ్మెన్  గ్రామానికి చేరుకుంటారని చెప్పారు.

 పోల్కంపల్లి, బొమ్మనపల్లి, పదర, లింగాల మండలం భాకారం, గట్టు తుమ్మెన్, ఉప్పునుంతల మండలం కంసాన్ పల్లి, వంగూరు మండలం ఉల్పర, అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో ఏర్పాటు చేయనున్న సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేస్తారని కలెక్టర్​ తెలిపారు. అనంతరం గట్టు తుమ్మెన్  గ్రామంలో ఏర్పాటు చేసిన పబ్లిక్  మీటింగ్​లో పాల్గొంటారని చెప్పారు. డిప్యూటీ సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.