ఇండియా టాప్ స్కోరర్‌‌‌‌గా నిలిచినప్పటికీ.. మంధాన చేజారిన టాప్ ర్యాంక్‌‌

ఇండియా టాప్ స్కోరర్‌‌‌‌గా నిలిచినప్పటికీ.. మంధాన చేజారిన టాప్ ర్యాంక్‌‌

దుబాయ్‌‌: విమెన్స్‌‌ వన్డే వరల్డ్ కప్‌‌లో ఇండియా టాప్ స్కోరర్‌‌‌‌గా నిలిచినప్పటికీ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వన్డే ర్యాంకింగ్స్‌‌లో తన టాప్ ప్లేస్‌‌ను కోల్పోయింది. ఈ మెగా టోర్నీలో 571 రన్స్‌‌తో విజృంభించిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్‌‌వార్ట్ రెండు స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. దాంతో మంధాన రెండో స్థానానికి పడిపోయింది. 

వరల్డ్ కప్ సెమీ ఫైనల్, ఫైనల్లో సెంచరీలు సాధించిన వోల్‌‌వార్ట్  తన కెరీర్‌‌లోనే అత్యధికంగా 814 రేటింగ్ పాయింట్లను సాధించింది. మరోవైపు, సెమీఫైనల్‌‌లో ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసిన ఇండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి పదో ర్యాంకులోకి దూసుకొచ్చింది.

 కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ కౌర్ కూడా నాలుగు స్థానాలు మెరుగై 14వ ర్యాంకులో నిలిచింది. బౌలర్లలో సౌతాఫ్రికాకు చెందిన మరిజేన్ కాప్ నాలుగు నుంచి రెండో ప్లేస్‌‌కు చేరుకుంది. వరల్డ్ కప్‌‌లో ప్లేయర్ ఆఫ్​ద టోర్నమెంట్‌‌గా దీప్తి శర్మ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌‌లో  ఐదు నుంచి  నాలుగో ప్లేస్‌‌ అందుకుంది.