
ఇంద్రవెల్లి, వెలుగు: వంజారి సమాజ్ ప్రజలు ఐక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని సమాజ్ పెద్దలు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం వంజారి సమాజ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ముందుగా కుల గురువు భగవాన్బాబా ఫొటోకు నివాళులు అర్పించారు.
అనంతరం కుల పెద్దలు మాట్లాడారు. వంజారి సమాజ్ ప్రజలు ఐక్యంగా ఉండి తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యంగా ఉంటేనే న్యాయమైన హక్కుల సాధన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంద్రవెల్లి గ్రామ పటేల్ డోంగ్రే మారుతి, సమాజ్ పెద్దలు సంజీవ్, బాబు, కేశవ్, దేవిదాస్, విశ్వనాథ్, కైలాస్, ప్రకాష్, వంజారి సమాజ్ పెద్దలు పాల్గొన్నారు.