కాకా కుటుంబంతోనే పెద్దపల్లి అభివృద్ధి

కాకా కుటుంబంతోనే పెద్దపల్లి అభివృద్ధి

పెద్దపల్లి, వెలుగు: కాకా కుటుంబంతోనే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధి జరిగిందని, రానున్న కాలంలో కాకా మనుమడు గడ్డం వంశీకృష్ణ తోనే మళ్లీ నియోజకవర్గం డెవలప్‌‌ అవుతుందని కాంగ్రెస్ సీనియర్​ లీడర్‌‌‌‌ బాలసాని సతీశ్‌‌  ఆదివారం తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకటస్వామి, ఆయన కుమారుడు డాక్టర్‌‌‌‌ వివేక్‌‌ వెంకటస్వామి హయాంలో పెద్దపల్లి పార్లమెంట్‌‌ పరిధిలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.

విశాక ట్రస్ట్​ ద్వారా బోర్‌‌‌‌వెల్స్‌‌ ఏర్పాటు చేయించారని, స్కూళ్లకు బెంచీలు, ఇతర వస్తువులను అందజేసిన ఘనత వివేక్​ వెంకటస్వామి కుటుంబానిదని పేర్కొన్నారు. అలాంటి కుటుంబం నుంచి పార్లమెంట్​ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలు​ అసత్య ఆరోపణలు చేస్తున్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.  వంశీకృష్ణ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు.