సత్తుపల్లి బీఆర్ఎస్​ సభను సక్సెస్​ చేయాలి : సండ్ర వెంకట వీరయ్య

సత్తుపల్లి బీఆర్ఎస్​ సభను సక్సెస్​ చేయాలి : సండ్ర వెంకట వీరయ్య

సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.90 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్​శనివారం శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. శుక్రవారం తన క్యాంప్​ఆఫీసులో ఎమ్మెల్యే సండ్ర మీడియాతో మాట్లాడారు. రూ.5కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం, ఆడిటోరియం, రూ.2 కోట్లతో షాదీఖాన, రూ.4 కోట్లతో చేపట్టనున్న వేంసూరు రోడ్ విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్​రాష్ట్రాన్ని ఒక విజన్​తో అభివృద్ధి చేస్తున్నారని, కేటీఆర్​ఆయన బాటలోనే ఎన్నో కంపెనీలు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుతున్నారని తెలిపారు.

నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి సత్తుపల్లిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు కాకర్లపల్లి రోడ్​లో సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయనతో మున్సిపల్ చైర్మన్ కోసంపూడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జడ్పీటీసీ రామారావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శీలపురెడ్డి కృష్ణారెడ్డి, పెనుబల్లి జడ్పీటీసీ చకిలాల మోహన్ రావు, నాయకులు యాగంటి శ్రీనివాసరావు, రఫీ, కనగాల వెంకటరావు, అంకమరాజు, లక్కినేని వినిల్ తదితరులు పాల్గొన్నారు.