
హైదరాబాద్, వెలుగు: డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) విధులు నిర్వహిస్తున్న ఎస్.దేవేందర్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఇలంబరితి ఉత్తర్వులిచ్చారు.
శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో నియామకాలు చేపట్టనున్నారు. లేఔట్ అనుమతులు, ప్లానింగ్, డెవలప్మెంట్ తదితర అంశాలపై పట్టున్న ఆఫీసర్లను నియమించే ప్రక్రియ కొనసాగుతున్నది.