IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ఓపెనర్ ఔట్

IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ఓపెనర్ ఔట్

దేశంలో ఐపీఎల్ హడావుడికి మరో నెల రోజులే సమయం ఉంది. ఈ మెగా లీగ్ కు సంబంధించి నిన్న (ఫిబ్రవరి 22) బీసీసీఐ మొదటి 21 రోజుల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మ్యాచ్‌లు మార్చి 22 నుండి ఏప్రిల్ 7 వరకు జరుగుతాయి. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన T20 మ్యాచ్ లో అతని కాలి బొటనవేలికి గాయమైంది. దీంతో రెండో టీ20లో ఈ కివీస్ స్టార్ బరిలోకి దిగలేదు. గాయం తగ్గలేకపోవడంతో ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ కు దూరమయ్యాడు. తాజా సమాచార ప్రకారం ఈ కివీస్ ప్లేయర్ బొటనవేలు శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంది. ఈ కారణంగా కాన్వే ఐపీఎల్ తొలి అర్ధ భాగానికి దూరం కానున్నాడు. న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ కాన్వే ఎడమ బొటనవేలుపై చిన్న ఫ్రాక్చర్ ఉందని ధృవీకరించారు.     

కాన్వే గత రెండేళ్లుగా చెన్నై తరపున నిలకడగా ఆడుతూ జట్టు  విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాన్వే లేకపోవడం చెన్నైకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. 2023 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ పై జరిగిన ఫైనల్లో చెన్నై తరపున టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచ్చుకున్నాడు. కాన్వే లేకపోవడంతో కివీస్ ఆల్ రౌండర్ రచీన్ రవీంద్ర గైక్వాడ్ తో కలిసి చెన్నై ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.    

Also Read: డబ్ల్యూటీసీలో ఇండియాకు టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌