అలంపూర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య కావడంతో భక్తులు గురువారం తెల్లవారుజామున నుంచే ఆలయాలకు చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు ముందుగా తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు  చెల్లించుకున్నారు.