దండేపల్లి, వెలుగు: గూడెం గుట్టపై శనివారం కార్తీక సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సమీప గోదావరి నదిలో పుణ్యస్నానం చేశారు. అనంతరం 595 మంది దంపతులు రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు.
అనంతరం గుట్ట పైకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని, ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. దేవస్థానం తరఫున ఉచిత తాగునీరు, అన్నప్రసాద వితరణ చేసినట్లు పేర్కొన్నారు.
