చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి జాతర సందడిగా సాగుతోంది. ఆదివారం కావడంతో కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామి దర్శనానంతరం భక్తులు జాతరలో ఫేమస్ అయిన మటన్ సీకులు(మటన్ కబాబ్స్) కొనుగోలు చేసి ఆరగించారు. రంగులరాట్నం, వివిధ ఆట వస్తువుల
వద్ద పిల్లలు సరదాగా గడిపారు. నగోయ హైదరాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జపాన్ కు చెందిన వ్యాపారవేత్తలు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి వారిని ఘనంగా సన్మానించారు.
