
జయశంకర్ భూపాలపల్లి/ మహాదేవ్‌పూర్, వెలుగు : త్రివేణీ సంగమం భక్తులతో కిక్కిరిసింది. మంగళవారం ఆరో రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సరస్వతి పుష్కర స్నానాలు చేశారు. కాళేశ్వర తీరంలో భక్తులు తాత్కాలికంగా దేవాతా ప్రతిమలను ఏర్పాటు చేసి మొక్కారు. పితృదేవులకు పిండ ప్రధానాలు చేశారు. అనంతరం కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, భక్తుల తాకిడి పెరగడంతో కలెక్టర్ రాహుల్ శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సరస్వతి నవరత్నమాల హారతి ఘట్టాన్ని ప్రతీ రోజూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది