భక్తులతో కిటకిటలాడుతున్న కొమురవెల్లి.. స్వామివారి దర్శనానికి 3 గంటలు

భక్తులతో కిటకిటలాడుతున్న కొమురవెల్లి.. స్వామివారి దర్శనానికి 3 గంటలు

సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. స్వామివారి శ్రీఘ్ర దర్శనానికి రెండు గంటలు, ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

సంక్రాంతి పండుగ సెలవులు, వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమ్రోగుతుంది. ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. మహామండపంలో స్వామివారికి కల్యాణం నిర్వహించి ఓడిబియ్యం పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు.

ఆలయ ప్రాంగణం గంగిరేగు చెట్టు దగ్గర పంచవర్ణాలతో యాదవ పూజారులు పట్నాలు రచించి, మట్టి పాత్రలో బోనం నైవేద్యంగా సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి పట్టువస్త్రాలు, ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు.