హిందువులు శనివారానికి చాలా ప్రత్యేకత ఇస్తారు. శనివారం రోజు శని భగవానుడిని పూజిస్తారు. అలాగే విష్ణుమూర్తిగా భావించే శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజిస్తారు. శనివారం సాక్షాత్ శ్రీ మహా విష్ణువు అంశం అయిన శ్రీ వెంకటేశ్వరస్వామికి శనివారం ఎంతో ఇష్టమైన రోజు.ఆ రోజు కొన్ని పనులు చేస్తే మనం తెలియక చేసిన పాపాలు పోవడమే కాకుండా సకల సంపదలు ..సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి అవేమిటో ఈస్టోరీలో తెలుసుకుందాం..
ప్రతి శనివారం ఉదయం శివాలయంలో శని భగవానుడికి నువ్వులు.. బెల్లం.. నువ్వుల నూనె సమర్పిస్తారు. సాయం వేళలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేస్తారు. వీటితో పాటు ఓ మూడు పనులు చేస్తే జీవితంలో అన్నీ చికాకులు తొలగిపోతాయని... ఇలాశనివారం చేస్తే ఫలితం ఉంటుందని పండితులు చెబుతుంటారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి శనివారం ఈ విధంగా ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న అన్ని చికాకులు పోతాయి.
ప్రతి శనివారం ఓ మూడింటికి ప్రదక్షిణాలు చేస్తే ఫలితం బాగుంటుందని.. కోరిన కోరికలు తీరుతాయని.. పరిష్కారం కాని సమస్యలు ఇట్టే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
రావి చెట్టు : రావి చెట్టుకి ప్రతి శనివారం మూడు ప్రదక్షిణాలు కనుక చేస్తే చాలా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆ చెట్టు కింద ఉండే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుంది. శనిభగవానుడి శాంతించి ఆయన ప్రభావాన్ని కూడా తగ్గిస్తాడు. అందుకే ప్రతి శనివారం రావిచెట్టు ప్రదక్షిణాలు చాలా మంచిదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
హనుమంతుడు : శనివారం కేవలం గోవిందుడీకే కాదు హనుమంతుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు.
జీవితంలో తెలియని బాధలు తీరని కోరికలు ఏదైనా ఆరోగ్య సమస్యలు కనుక వేధిస్తుంటే హనుమంతుడికి 11 ప్రదక్షిణాలు చెయ్యాలి. హనుమంతుడికి 108 తమలపాకులతో పూజ చేయాలి. అప్పాలమాల.. వడ మాల సమర్పించాలి. ఇలాగా చెయ్యడం వల్ల హనుమంతుని కరుణ ఎప్పుడూ ఉంటుంది. క్షుద్ర శక్తుల నుంచి విముక్తి కలుగుతుంది. రాత్రి సమయంలో పడుకొనేటప్పుడు ఆంజనేయ దండకాన్ని చదువుకోవాలి. అలాగే వేంకటేశ్వరస్వామికి ప్రతి శనివారం లేదా నిత్యం 7 ప్రదక్షిణాలు కనుక చేస్తే ఇంక మీ అదృష్టానికి తిరుగు ఉండదని పండితులు చెబుతున్నారు.
తులసి మొక్క : ప్రతి ఇంట్లో ఉండే మొక్క తులసి మొక్కని పూజిస్తే మనకి ఈ జన్మలో ఉన్న పాపాలే కాకుండా ఏడేడు జన్మల పాపాలు పోతాయి అని పెద్దలు చెబుతారు పైగా ఆడవాళ్ళకి ఐదవతనం కడుపు చలవతో పాటు ఆ ఇంటికి ఎప్పుడు రక్షగా తులసీదేవి తల్లి వలే కాపాడుతుంది. అందుకే ప్రతి శనివారం 3 ప్రదక్షిణాలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
