రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది

రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది

కరోనా ‎రెండో డోస్‎ను లైట్ తీసుకోవద్దని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. తెలంగాణలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ మీద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని తెలిపారు. ‘తెలంగాణాలో ఒకట్రెండు రోజుల్లో 3 కోట్ల డోసుల వాక్సినేషన్ పూర్తి కానుంది. ఇప్పటికే 75 శాతం మందికి మొదటి డోస్.. 39 శాతం మందికి రెండో డోస్ పూర్తయింది. ప్రస్తుతం తెలంగాణలో 50 లక్షల వ్యాక్సిన్ నిల్వ ఉంది. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది. రోజూ 0.4 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా నుంచి 99 శాతం రక్షణ లభిస్తుంది. రాష్ట్రంలో రెండో డోస్ తీసుకోవాల్సిన వాళ్ళు 36 లక్షల 35 వేల మంది ఉన్నారు. వీరందరూ రెండో డోస్‎ను లైట్ తీసుకోవద్దు. రష్యా, యూకేల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోని వాళ్లలో 60 శాతం మందికి వైరస్ సోకుతుంది. ఒక్క డోస్ తీసుకున్న వాళ్లలో 30 శాతం మందికి కరోనా సోకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలి. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోస్ కూడా తీసుకోలేదు’ అని ఆయన తెలిపారు.
For More News..

అదుర్స్ అనిపించిన రాజ్ పుత్ మహిళల కత్తిసాము

ఎక్కడ గెలవరో.. అక్కడికి హరీశ్‎ను పంపిస్తారు

త్వరలో ఫేస్‎బుక్ పేరు మార్పు!