అదుర్స్ అనిపించిన రాజ్ పుత్ మహిళల కత్తిసాము

అదుర్స్ అనిపించిన రాజ్ పుత్ మహిళల కత్తిసాము

గుజరాత్‎లో రాజ్ పుత్‎లు నిర్వహించే తల్వార్ రాస్ కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. నిన్న ప్రారంభమైన ఈ ఉత్సవాలలో రాజ్ పుత్ మహిళల కత్తిసాము అదుర్స్ అనిపించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది రాజ్ పుత్ మహిళలు పాల్గొన్నారు. కత్తియుద్ధం ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. రాజవంశస్థులైన రాజ్ పుత్‎లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్‎కు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఫోక్ డ్యాన్స్, కత్తియుద్ధాలతో మహిళల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. 2000 సంవత్సరంలో జరిగిన ఈవెంట్‎లో రాజ్ పుత్ మహిళలు తల్వార్ రాస్‎తో గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించారు. అక్టోబర్ 19న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 24 వరకు జరగనున్నాయి.

For More News..

ఎక్కడ గెలవరో.. అక్కడికి హరీశ్‎ను పంపిస్తారు

లఖీంపూర్ ఘటనపై సుప్రీం సీరియస్

త్వరలో ఫేస్‎బుక్ పేరు మార్పు!