మళ్లీ లాక్ డౌన్, కర్ఫ్యూ ఆలోచనల్లేవ్..

మళ్లీ లాక్ డౌన్, కర్ఫ్యూ  ఆలోచనల్లేవ్..


రాష్ట్రంలో లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి ఆలోచనల్లేవన్నారు డిహెచ్ శ్రీనివాస్. గాంధీ ఆస్పత్రిని అవసరం అయితే మళ్లీ కోవిడ్  సేవలకు వినియోగిస్తామన్నారు. నాన్ కోవిడ్ కేసులను క్లోజ్ చేస్తామన్నారు. గాంధీలో ఇప్పటికే కోవిడ్ రోగుల కోసం బెడ్స్ పెంచేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో, అలాగే  తెలంగాణలో  సెకండ్ వేవ్ మొదలైందన్నారు. కోవిడ్ కేస్ లు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు మూసివేయాలని సర్కారు కు సూచించామన్నారు. జిల్లా ఆస్పత్రులు, పిహెచ్ సి లు సహా ప్రభుత్వ ఆస్పత్రులను అప్రమత్తం చేసామన్నారు. కోవిడ్ చికిత్సలకు అవసరమైన పరికరాలు, కిట్ లు, మాస్క్ లు వంటి వాటి అందుబాటుపై సమావేశం నిర్వహించామన్నారు.