25 లక్షల కుటుంబాలకు ధ‌నీ యాప్ ఫ్రీ కోవిడ్ కేర్ మెడిసిన్స్

25 లక్షల కుటుంబాలకు ధ‌నీ యాప్ ఫ్రీ కోవిడ్ కేర్ మెడిసిన్స్

ధనీ యాప్ రూ. 90 కోట్ల విలువైన 25 లక్షల ఉచిత కోవిడ్ సంరక్షణ ఆరోగ్య కిట్స్‌ని పంపిణీ చేయడం ప్రారంభించింది. ప్రతి కోవిడ్ సంరక్షణ ఆరోగ్య కిట్‌లో 2 వ్యక్తులకు కావాల్సిన‌ రోగ నిరోధక మందులు ఉంటాయి. ధనీ అనేది ఇండియా బుల్స్ గ్రూప్ యొక్క డిజిటల్ యాప్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యాపారం. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిన ప్రకారం ఈ కిట్‌ని ప్యాక్ చేశారు. కోవిడ్ 19లో ప్రారంభ వ్యాధినిరోదక సంరక్షణగా సహాయపడుతుంది.

ఈ కిట్‌లో ఒక నెలకు సరిపడా మందులు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ డి3, జింకు ద్వారా మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. జ్వరం,  ఒళ్ళు నొప్పులు ఉంటే వేసుకునేందుకు పారాసెటమాల్ ఉంది. ఇందుకోసం ధనీ యాప్‌కి లాగిన్ అయి ఉచితంగా ఆర్డరు పెట్టుకోవచ్చు.  డాక్టర్లు, స్పెషలిస్టులతో రేయింబవళ్ళు ఫ్రీ వీడియో కాల్స్ కూడా ధనీ అందిస్తోంది. ఎవరైనా సరే 15 సెకన్ల‌ లోపు వీడియో కాల్‌లో డాక్టరుతో మాట్లాడవచ్చు.