మంచి థ్రిల్లర్ సినిమా తీసిన ఈ డైరెక్టర్.. ధనుష్ను మండుతున్న పత్తి పొలంలో నిల్చోబెట్టేశాడు !

మంచి థ్రిల్లర్ సినిమా తీసిన ఈ డైరెక్టర్.. ధనుష్ను మండుతున్న పత్తి పొలంలో నిల్చోబెట్టేశాడు !

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో ధనుష్. రీసెంట్గా కుబేర మూవీతో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ధనుష్ తన కొత్త సినిమా అనౌన్స్ చేసి ఆసక్తి పెంచాడు.

ఇవాళ (జూలై 10న) ధనుష్ తన 54వ సినిమాను ప్రకటించాడు. D54 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో మూవీ తెర‌కెక్క‌బోతుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచింది.

పోస్ట‌ర్‌లో చుట్టూ కాలిపోతున్న పత్తి పంట మధ్యలో ధ‌నుష్ ఎమోషనల్గా నిల‌బ‌డి  ఉన్నాడు. అతని వెనుక అలుముకున్న భయంకరమైన మంటలు సినిమాకథాంశంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది చాలా ఉత్కంఠభరితమైన, నాటకీయమైన కథతో రాబోతోందని పోస్టర్ సూచిస్తుంది. ఇవాళ గురువారం నుండే మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు “Por Thozhil” (పోర్ తొళిల్‌) అనే థ్రిల్ల‌ర్‌తో సూప‌ర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు విఘ్నేష్ రాజా దర్శకత్వం వ‌హిస్తున్నాడు. 

ఈ మూవీలో ‘ప్రేమలు’ఫేమ్ నటి మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో జయరామ్, కె.ఎస్. రవికుమార్, సూరజ్ వెంజరమూడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ALSO READ : తన సినిమా ప్రివ్యూ చూస్తూనే బ్రెయిన్ స్ట్రోక్.. దర్శకుడు మృతి

వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా. ఇషారి కె. గణేష్, థింక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా, ఆల్ఫ్రెడ్ ప్రకాష్ కలిసి సినిమాకథను రూపొందించారు. వీరిద్దరూ కలిసి పోర్ తొళిల్‌ కూడా రాశారు. తేని ఈశ్వర్ కెమెరామెన్‌గా, శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్‌లు నిర్వహిస్తున్నారు.

పోర్ తొళిల్:

పోర్ తొళిల్ ఇదొక తమిళ క్రైమ్ థ్రిల్లర్. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తెలుగులోనూ స్ట్రీమింగ్‍ అవుతుంది. ఇందులో శరత్ కుమార్, అశోక్ సెల్వన్ నటించారు. సస్పెన్స్, థ్రిల్లింగ్‍ అంశాలతో  పోర్ తొళిల్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రతీ సీన్‍లోనూ ఆసక్తిని రేపుతుంది. తర్వాత ఏం జరుగుతుందోననే సస్పెన్స్ కొనసాగిస్తుంది. ఈ ‘పోర్ తొళిల్’ కథ రాసుకున్న విధానం, స్క్రీన్‍ప్లే అంత గొప్పగా ఉన్నాయి. ఇప్పుడే ఈ సినిమా డైరెక్టరే ధనుష్ తో సినిమా చేస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. 

ధనుష్ సినిమాలు:

ప్రస్తుతం ధనుష్.. ఆదిపురుష్ డైరెక్టర్ తో అబ్దుల్ కలాం బయోపిక్, మారి సెల్వరాజ్‌తో కలిసి ఒక చిత్రం మరియు హిందీ చిత్రం తేరే ఇష్క్ మే ఉన్నాయి. అలాగే, తన దర్శకత్వంలోనే ఇడ్లీ కడై చేస్తున్నాడు. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇందులో అరుణ్ విజయ్, షాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజ్ కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వుండర్‌బార్ ఫిల్మ్స్ మరియు డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ పంపిణీ చేస్తుంది. ఇటీవలే రాయన్, నెక్ వంటి మూవీస్ తో దర్శకుడిగా తన మార్క్ చూపించాడు.