‘మిస్‌‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుండి ధనుష్ పాడిన పాట

‘మిస్‌‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుండి ధనుష్ పాడిన పాట

హీరోగానే కాక నిర్మాతగా, దర్శకుడిగా, లిరిక్ రైటర్‌‌‌‌గా, సింగర్‌‌‌‌గానూ మెప్పించాడు ధనుష్. ఈ మల్టీటాలెంటెడ్ హీరో తన సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమాలకు కూడా అప్పుడప్పుడు పాటలు పాడుతుంటాడు. తాజాగా ఓ తెలుగు సినిమా కోసం పాట పాడాడు ధనుష్. అనుష్క, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం ‘మిస్‌‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఇందులో ధనుష్ పాడిన పాటను ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఫన్నీ అనౌన్స్‌‌మెంట్ వీడియోను శనివారం విడుదల చేశారు. ఈ మధ్య హీరోలు తమ చిత్రాల్లో తామే పాటలు పాడుకుంటున్నారనీ, అందుకే ఇందులో తానూ ఓ పాట పాడతానంటూ డైరెక్టర్, లిరిక్ రైటర్, ప్రొడ్యూసర్ దగ్గర నానా హడావుడి చేశాడు నవీన్. కానీ రికార్డింగ్ థియేటర్‌‌‌‌లో అతను పాడుతుంటే ధనుష్‌‌ వాయిస్ వినిపిస్తోంది. ‘హతవిధీ ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లిచీమ బతుకుపై బుల్డోజరైనదీ’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు.