
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ ‘కుబేర’. నేడు థియేటర్స్లో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. సెన్సిబుల్ కథలతో అందరినీ మెప్పించిన కమ్ముల.. ఈసారి పెద్ద విజన్‌తో, కమర్షియల్ మేకింగ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సెన్సిబుల్ కథలతో అందరినీ మెప్పించిన కమ్ముల.
కార్పోరేట్ వ్యవస్థలు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయి? రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం ఎలాంటి అవినీతి పనులు చేస్తున్నారు? బ్లాక్ మనీ ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. ఇందుకోసం దర్శకుడు శేకర్ కమ్ముల చాలా లోతుగా అధ్యయనం చేసిన తీరు కథలో కనిపిస్తుంది.
కుబేర బడ్జెట్:
భారీ క్యాస్టింగ్తో.. దాదాపు రూ.120-150 కోట్ల బడ్జెట్తో కుబేర తెరకెక్కింది. ఈ మూవీకి తమిళ, తెలుగు మార్కెట్స్‌లో థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. తమిళంలో రూ.20 కోట్లు, తెలుగులో రూ.40 కోట్లు, ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.5 కోట్లు చొప్పున మొత్తంగా రూ.65 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సినీ వర్గాల సమాచారం.
అంటే.. ఈ లెక్కన కుబేర మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.66 కోట్ల షేర్, రూ.132 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కుబేర మూవీకి ఉన్న బజ్, నాగార్జున, ధనుష్ కు ఉన్న సౌత్ మార్కెట్ ను బట్టి ఈ టార్గెట్ పెద్దకష్టమేమి కాదు. అందులోనూ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అంటే, రాబోయే 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుతుందని క్రిటిక్స్ అంటున్నారు. చూడాలి మరి ఎలాంటి వసూళ్లు వస్తాయో!
ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్:
తెలుగు రాష్ట్రాలు: రూ.33 కోట్లు
తమిళనాడు: రూ.20 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ.6 కోట్లు
ఓవర్సీస్: రూ.8.5 కోట్లు