
ధనుష్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. తన కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టీజర్‌తో ఇంప్రెస్ చేసిన టీమ్, బుధవారం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
‘కిల్లర్ కిల్లర్.. కెప్టెన్ మిల్లర్’ అంటూ సాగిన ఈ పాటను జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయగా.. సింగర్ హేమచంద్రతో కలసి హీరో ధనుష్ ఎనర్జిటిక్‌గా పాడాడు. రాకేందు మౌళి రాసిన లిరిక్స్ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. వీడియోలో వైల్డ్‌గా కనిపిస్తున్నాడు ధనుష్.
1930 - 40 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. సంక్రాంతికి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.