ముప్పతిప్పలు పెడుతున్న ధరణి వెబ్ సైట్

ముప్పతిప్పలు పెడుతున్న ధరణి వెబ్ సైట్

హైదరాబాద్: రిజిస్ట్రేషన్లలో అక్రమాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్ సైట్ ముప్పతిప్పలు పెడ్తోంది. వెబ్ సైట్ లో లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ రైతులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు. లక్ష్మాపూర్ కు సంబంధించిన రైతుల భూముల వివరాలు వెబ్ సైట్ లో లేవు. 
నక్ష ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ హామీ కూడా అమలు కాలేదు. దీంతో రైతుబంధు, క్రాప్  లోన్లు రావడం లేదు. ధరణిలో వివరాలు లేకపోవడంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆగిపోయాయి. సీఎం దత్తత తీసుకున్నా తమ గ్రామం అభివృద్ధి జరగలేదన్నారు రైతులు. ధరణిలో తమ భూములు వివరాలు రికార్డ్ చేసి న్యాయం చేయాలని కోరారు. మరోవైపు లక్ష్మాపూర్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు రెవెన్యూ అధికారులు.