మహిళా బిల్లు కాదు.. దొరసానుల బిల్లు: విశారదన్ మహరాజ్

మహిళా బిల్లు కాదు.. దొరసానుల బిల్లు: విశారదన్  మహరాజ్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ‘పార్లమెంట్​లో ప్రవేశపెట్టబోయేది మహిళా బిల్లు కాదని..దొరసానుల బిల్లు అని డీఎస్పీ చీఫ్​ డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ లో ధర్మ సమాజ్ పార్టీ మొదటి ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళా బిల్లు అమలైనా వెలమ, రెడ్లకు సంబంధించిన లీడర్ల భార్యలు, బంధువులే రాజ్యమేలుతారన్నారు. మహిళా బిల్లును అమలు చేస్తే 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్​ స్కీం నీళ్లు రెడ్డి, వెలమల భూముల్లోనే పారుతాయన్నారు. 

ఆయకట్టు కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు లేవన్నారు. రాజకీయంగా, సామాజికంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పూర్తిగా అగ్రకులాలు రాజ్యమేలుతున్నాయన్నారు. ఎస్సీ రిజర్వుడ్​ స్థానమైన అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజును అసెంబ్లీకి పంపితే ఆయన అగ్రకులాలకే పని చేస్తున్నారన్నారు. కొల్లాపూర్ లో వెలమల రాజ్యం మళ్లీ వస్తుందన్నారు. డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సాయి, ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా ఇన్​చార్జి శివ, బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్ గౌడ్, కాళ్ల నిరంజన్, రామచంద్రయ్య పాల్గొన్నారు.