15 రోజులైనా వడ్ల పైసలు పడలే.. 

15 రోజులైనా వడ్ల పైసలు పడలే.. 

మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో కొన్న వడ్లకు 48గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి 15 రోజులు దాటినా ఇంకా చెల్లించడం లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, రైతు ఐక్యవేదిక లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మెట్‌పల్లి మండలం వెంపేట, చింతలపేట్ గ్రామాలలో తడిసిన వడ్లను పరిశీలించి నిరసన తెలిపారు. రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి, చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి,  రాజరెడ్డి, శంకర్ రెడ్డి, రాజరెడ్డి , రఘు, లక్ష్మీరాజం, ప్రవీణ్ కుమార్, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

పెగడపల్లిలో కాంగ్రెస్​ లీడర్ల ధర్నా

పెగడపల్లి, వెలుగు:  రోహిణి కార్తె స్టార్టయిందని, అయినా వడ్లు కొనుగోళ్లు పూర్తికాలేదని కాంగ్రెస్​ లీడర్లు ఆరోపించారు. మంగళవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ దగ్గర ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 40 రోజుల కింద వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే నేటికీ కొనుగోళ్లు పూర్తికాలేదని ఆరోపించారు. ఆ కొన్న వడ్లకు కూడా క్వింటాల్ కు 6 నుంచి 8 కేజీలు కట్ చేయడమే కాకుండా లారీలు లేవని సాకుతో బస్తాకు ఇంతా అని దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి వడ్లు తడిశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మంత్రి కొప్పుల ప్రచారం చేసుకుంటున్నారనే తప్ప రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో లీడర్లు రాములు గౌడ్, మహేందర్ రెడ్డి, శంకర్ తిరుపతి, సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.