హైబ్రిడ్ మక్క సీడ్స్తో అధిక దిగుబడి

హైబ్రిడ్ మక్క సీడ్స్తో అధిక దిగుబడి

పరిగి, వెలుగు: డీహెచ్​ఎం 20 హైబ్రిడ్​ విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్త  డాక్టర్​ సుజాత తెలిపారు. వికారాబాద్​ జిల్లా పరిగి మండలం సయ్యద్​పల్లి గ్రామంలో ప్రొఫెసర్​ జయశంకర్​ అగ్రికల్చర్​ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మొక్కజోన్న పంట దిగుబడులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. లుథియానా సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కజొన్న పంటను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 

అనంతరం 63 మంది రైతులకు ఫ్రీగా మొక్కజొన్న సీడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్​ జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం, సైంటిస్టులు మల్లయ్య, శ్రావణి, టి.రాజేశ్వర్​రెడ్డి, మధు శేఖర్​ తదితరులు పాల్గొన్నారు.