డయాబెటిస్.​..10 అధిక ప్రభావిత రాష్ట్రాలు

డయాబెటిస్.​..10 అధిక  ప్రభావిత రాష్ట్రాలు

ఇంతకుముందుతో పోలిస్తే జనాన్ని రకరకాల జబ్బులు తెగ ఇబ్బంది పెడుతున్నయ్​. నిల్చుంటేనొప్పి. కూర్చుంటే తీపి అన్నట్టు తయారైందిచాలామంది పరిస్థితి. ఎంత టెక్నాలజీ వస్తే ఏంది ఎన్ని సౌకర్యాలు ఉంటే ఏంది? ఆరోగ్యం సరిగా ఉంటే కదా వాటన్నింటినీ వాడుకునేది. ఎంజాయ్​ చేసేది. అదంతా సరే కానీ, ఇంత హైరానా పడాల్సిన విషయం ఇప్పుడేముంది!? కరోనాని కట్టడి చేసినం కదా అంటున్నారా. దాని సంగతి పక్కన పెడితే... ఆరోగ్యం గురించి కాస్త ఎక్కువ ఆలోచించాలని మొన్నీమధ్య విడుదలైన ఒక సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఢిల్లీ ఎయిమ్స్​, ఐసీఎంఆర్​ కలిసి దేశవ్యాప్తంగా ఈ సర్వే చేసినయ్​. అందులో ప్రజారోగ్యం గురించిన నిజాలు కొన్ని బయటికొచ్చినయ్​. 

అవేంటంటే... మన దేశ జనాభాలో 25 కోట్ల మంది జనరల్​ ఒబెసిటీతో బాధపడుతున్నారు. 31 కోట్లమందికి హైబీపీ ఉంది. 13 కోట్ల మంది ప్రి–డయాబెటిస్​ అంచున ఉన్నారు. మొత్తంమీద దేశ జనాభాలో పది కోట్ల మందికి పైగా షుగర్​ జబ్బుతో బాధపడుతున్నారు. కాగా గోవాలో అత్యధికంగా 26.4 శాతం డయాబెటిస్​ జబ్బున పడ్డారు. అదే మన రాష్ట్రంలో తీసుకుంటే 7.5 శాతం షుగర్​ పేషెంట్లు ఉన్నారు. అదే ఒబెసిటీ విషయానికొస్తే 25 శాతం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ లెక్కలన్నీ చూశాక అయినా ఒళ్లు భద్రంగా పెట్టుకోవాలి కదా!

మరీ ముఖ్యంగా చక్కెర జబ్బు విషయంలో ఇంకింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అది శరీరంలో ఒక్కో పార్ట్​ మీద దాడి చేసి మనిషిని ఆగమాగం చేస్తుంది. పిల్లాపెద్దా, ఆడమగా అనే తేడా లేకుండా అందరి మీద దాడిచేసే ఈ జబ్బు దరికి రాకుండా ఉండాలంటే ముఖ్యంగా చేయాల్సినవి కొన్ని ఉన్నయ్​. అవేంటంటే... ఏం తింటున్నమో చూసుకోవాలి. శరీరానికి సరైన ఎక్సర్​సైజ్ ఇస్తున్నమో లేదో గమనించుకోవాలి. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే.... ఆరోగ్య పగ్గాలు మీ చేతుల్లోనే ఉంటాయి. ఒకవేళ ఇప్పటికే చక్కెర జబ్బు ఒంట్లోకి చేరితే కనక ఒంటి మీదికి తెచ్చుకునే నెత్తినొప్పి ఎక్స్​పరిమెంట్స్​ చేయకుండా.... డాక్టర్​ చెప్పిన మందులు మంచిగా వేసుకుంటూ, వాళ్లు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ... మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో పెట్టుకోవాలి.