
- దీపావళి టైమ్‌లో ట్రక్కులు పెద్దగా తిరగక పోవడమే కారణం!
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో డీజిల్ వాడకం తగ్గింది. ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్‌లో డిమాండ్ తగ్గిందని, దీపావళి కావడంతో చాలా మంది ట్రక్ డ్రైవర్లు సెలవులు తీసుకోవడమే కారణమని ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. కిందటేడాది నవంబర్‌లో 73.3 లక్షల టన్నుల డీజిల్ అమ్ముడైందని, కిందటి నెలలో ఈ నెంబర్ 67.8 లక్షల టన్నులకు తగ్గిందని పేర్కొన్నాయి. ఇది 7.5 శాతం తగ్గుదల. ఈ నెలలో డిమాండ్ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటుందని కంపెనీ అంచనా వేస్తున్నాయి. పెట్రోలియం ప్రొడక్ట్‌లలో ఎక్కువగా వాడేది డీజిలే. మొత్తం పెట్రోలియం ప్రొడక్ట్‌ల వినియోగంలో డీజిల్ వాటా 40 శాతం ఉంటుంది. ఒక్క ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్‌లోనే 70 శాతం డీజిల్ అవసరం.
మరోవైపు ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల పెట్రోల్ సేల్స్ మాత్రం కిందటి నెలలో 7.5 శాతం పెరిగి (ఇయర్ ఆన్ ఇయర్) 28.6 లక్షల టన్నులకు చేరుకున్నాయి. పండుగ సీజన్‌లో పర్సనల్ వెహికల్స్ వాడకం పెరగడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఏప్రిల్ – అక్టోబర్ మధ్య పెట్రోల్ సేల్స్ 9 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పడ్డాయి. ఇదే టైమ్‌లో డీజిల్ అమ్మకాలు 3.2 శాతం తగ్గాయి. దసరా తర్వాత ఈ ట్రెండ్ కొద్దిగా మారింది. కిందటి నెల మొదటి 15 రోజుల్లో డీజిల్ డిమాండ్ (ఇయర్ ఆన్ ఇయర్) 12.1 శాతం పడిందని, చివరి 15 రోజుల్లో పుంజుకుందని ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో డీజిల్ అమ్మకాలు 3.6 శాతం పెరిగాయి.