పాలమూరులో అరుదైన పాము

పాలమూరులో అరుదైన పాము

మహబూబ్​నగర్​, వెలుగు : మహబూబ్​నగర్​ లో బుధవారం అర్ధరాత్రి బైపాస్ రోడ్డు సమీపంలోని  అక్షర కాలనీలో ఉంటున్న మాధవి ఇంట్లో అరుదైన పామును గుర్తించారు.   ఇంట్లో పాము చూసిన ఆమె జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్​ బాటనీ అసిస్టెంట్​ ప్రొఫెసర్​  బి. సదాశివయ్యకు సమాచారమిచ్చారు. ఆయన వచ్చి పామును పట్టుకున్నారు. సదాశివయ్య మాట్లాడుతూ.. ఈ పాము ఆరుదైన జాతికి చెందినదని,  సైంటిఫిక్​గా లైకోడాన్ ఫ్లావికల్లిస్ అంటారన్నారు. 

కోలుబ్రిడే జాతికి చెందిన ఈ పాము మెడపై పసుపు రంగు పెద్ద మచ్చ ఉండటంవల్ల ఎల్లో కాలర్డ్ వూల్ఫ్ స్నేక్ అని కూడా పిలుస్తారన్నారు. ఇది విషరహిత పాము అని చెప్పారు. 2007లో తమిళనాడులో గుర్తించారన్నారు. తెలంగాణలోనూ 2016లో హైదరాబాద్​, వనపర్తిలో కనిపించిందన్నారు.