టూల్స్ గాడ్జెట్స్..స్మార్ట్‌‌ నైట్ ల్యాంప్‌‌

టూల్స్ గాడ్జెట్స్..స్మార్ట్‌‌ నైట్ ల్యాంప్‌‌

రాత్రి పడుకునే ముందు చాలామంది లైట్లు ఆపేసి, బెడ్‌‌ ల్యాంప్ మాత్రమే ఆన్‌‌ చేస్తారు. ఉదయం నిద్ర లేచాక దాన్ని ఆపేయడం మర్చిపోతారు. ఎందుకంటే.. అప్పటికే తెల్లారిపోతుంది. దాంతో బెడ్​ల్యాంప్​ వెలుగుతోందనే విషయం గుర్తించడం కష్టం అవుతుంది. అలాంటి వాళ్లు ఈ హోర్డ్‌‌ స్మార్ట్‌‌ నైట్‌‌ ల్యాంప్‌‌ వాడితే సరిపోతుంది. ఇది వెలుతురు రాగానే ఆటోమెటిక్‌‌గా ఆఫ్‌‌ అయిపోతుంది. ఇందులో నైట్ సెన్సర్‌‌‌‌ ఉంటుంది. దానివల్ల వెలుతురు, చీకటిని ఇది గుర్తించగలదు. 

దీనికి ప్రత్యేకంగా హోల్డర్ అవసరం లేదు. కరెంట్ సాకెట్​లో ప్లగ్‌‌ ఇన్​ చేస్తే సరిపోతుంది. నాలుగు వైపులా నాలుగు ఎల్‌‌ఈడీ లైట్లు ఉంటాయి. ఇది 0.5 వాట్స్‌‌ కరెంట్‌‌మాత్రమే వాడుకుంటుంది. కాబట్టి కరెంట్‌‌ బిల్లు గురించి భయపడాల్సిన అవసరం లేదు. లివింగ్ రూమ్, బెడ్‌‌రూమ్, బాత్​రూమ్, హాలు, మెట్లు, కారిడార్‌‌‌‌లో కూడా ఈ ల్యాంప్​ పెట్టుకోవచ్చు. 

ధర : 269 రూపాయలు 

ట్రావెల్ డిస్పెన్సర్‌‌‌‌ 

ఎప్పుడూ ట్రావెల్‌‌ చేసేవాళ్లకు ఇది బెస్ట్‌‌ గాడ్జెట్‌‌. ఎందుకంటే.. ట్రావెల్‌‌ చేసేవాళ్లు వెళ్లిన ప్రతి చోటికి షాంపూ, కండిషనర్​, బాడీ లోషన్​, బాడీ వాష్, సీరమ్‌‌, హ్యాండ్ శానిటైజర్‌‌, హెయిర్‌‌‌‌ ఆయిల్‌‌ లాంటి వాటిని తీసుకెళ్లడం కుదరదు. ఆ బాటిళ్లు చాలా స్పేస్‌‌ ఆక్రమిస్తాయి. అలాకాకుండా ఉండాలంటే ఈ ఒక్క బాటిల్‌‌ తీసుకెళ్తే చాలు. ఇందులో నాలుగు చిన్న సైజు బాటిల్స్​ ఉంటాయి. వాటిలో మీకు కావాల్సిన వాటిని ఫిల్‌‌ చేసుకుని పట్టుకెళ్లొచ్చు. ఈ బాటిల్స్​ లీక్‌‌ ఫ్రూఫ్‌‌ క్యాప్‌‌లతో వస్తాయి. ప్రతి బాటిల్‌‌లో 40 ఎం.ఎల్‌‌. లిక్విడ్‌‌ని రీఫిల్ చేసుకోవచ్చు. ఈ బాటిల్​తోపాటు కొన్ని లేబుల్స్‌‌ కూడా వస్తాయి. ఏ బాటిల్‌‌లో ఏం నింపారో తెలుసుకునేందుకు ఈ లేబుల్స్‌‌ అతికించుకోవచ్చు. దీన్ని స్లైఫోర్డ్ అనే కంపెనీ మార్కెట్​లోకి తెచ్చింది. 

ధర : 284 రూపాయలు  

టాయ్ ప్రొజెక్టర్ లైట్‌

అప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లలకు రకరకాల వస్తువులు, జంతువులు చూపించి వాటి గురించి చెప్తుంటారు పెద్దలు. అయితే.. అలాంటివి ఈ లైట్‌‌తో నేర్పించడం ఈజీ అవుతుంది. ఈ లైట్ కొన్ని పండ్లు, వస్తువులు, జంతువుల బొమ్మలను ప్రొజెక్ట్‌‌ చేస్తుంది. లైట్‌‌తోపాటు 6 ప్రొజెక్షన్ డిస్క్‌‌లు ఉంటాయి. ప్రతిదానిలో ఎనిమిది బొమ్మలు ఉంటాయి. అంటే మొత్తంగా 48 యానిమేటెడ్ బొమ్మలు ప్రొజెక్ట్‌‌ అవుతాయి. దీన్ని వాడడం చాలా ఈజీ. ఒక్క బటన్‌‌ నొక్కితే చాలు. డిస్క్‌‌ను తిప్పుతుంటే బొమ్మలు మారుతుంటాయి. ఫ్లాష్‌‌లైట్‌‌గా కూడాత వాడొచ్చు. డిజైన్‌‌ కూడా చాలా కాంపాక్ట్‌‌గా ఉంటుంది. కనకధార అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. 

ధర : 289 రూపాయలు 

కేబుల్‌ ఆర్గనైజర్‌‌

ఇంట్లో డెస్క్‌‌టాప్ పీసీ  వాడేవాళ్లలో చాలామంది టేబుల్‌‌ కింద వైర్లు కాళ్లక తగులుతూ ఇబ్బంది పడుతుంటారు. సీపీయూ, కీబోర్ట్‌‌, మానిటర్‌‌‌‌, మౌస్‌‌, స్పీకర్ల వైర్లు గజిబిజిగా కనిపిస్తుంటాయి. వాటిని ఆర్గనైజ్‌‌ చేయడానికి టేబుల్‌‌కి ఈ హోల్డర్లు పెట్టుకుంటే సరిపోతుంది. వీటిని బ్రెయిన్‌‌వేవ్జ్‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. కేబుల్​ ఆర్గనైజర్​ హోల్డర్​లను గోడలకు కూడా ఫిక్స్‌‌ చేయొచ్చు. ఇవి “J” స్టైల్ హోల్డర్​ల కంటే చాలా సేఫ్. వీటిని అతికించడానికి క్లిప్‌‌లు లాంటివి అవసరం లేదు. దీనికి  సూపర్ స్ట్రాంగ్ టేప్‌‌ ఉంటుంది. దాంతో అతికించాలి. 

ధర : 3 హోల్డర్లకు 499 రూపాయలు