Dil Raju: దేనికైనా ఒక లెక్క ఉంటుంది.. స్టార్ హీరోల రెమ్యునరేషన్పై దిల్ రాజు కామెంట్స్

Dil Raju: దేనికైనా ఒక లెక్క ఉంటుంది.. స్టార్ హీరోల రెమ్యునరేషన్పై దిల్ రాజు కామెంట్స్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) స్టార్ హీరోల రెమ్యునరేషన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేనికైనా ఒక లెక్క ఉంటుందని, వాటి ప్రకారమే పేమెంట్స్ జరుగుతాయని ఆయన అన్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star). ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రస్తుతం ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్ ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్స్ లలో పాల్గొంటున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ది ఫ్యామిలీ స్టార్ తమిళ ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇంతకుముందు తమిళ స్టార్ హీరో విజయ్ తో నేను చేసిన వారిసు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అలాంటి కథతో నేను చేస్తున్న సినిమా ది ఫ్యామిలీ స్టార్. పేద, గొప్ప అనే తేడా లేకుండా ప్రతీ ఇంటికి ఒక స్టార్ ఉంటాడు. అలాంటి స్టార్ ల కథే ఈ సినిమా. ఇప్పటివరకు రౌడీ స్టార్ గా ఉన్న విజయ్ ఈ సినిమా రిలీజ్ తరువాత ఫ్యామిలీ స్టార్ గా మారిపోవడం ఖాయం. అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. 

ఇక మీడియా మీట్ లో భాగంగా.. రిపోర్టర్స్ స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ గురించి ప్రస్తావించారు. దానికి సమాధానంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు హీరోలకి అధిక రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనేది నేను నమ్మను, అంగీకరించను కూడా. ఎందుకంటే.. ప్రతీ దానికి ఒక లెక్క ఉంటుంది. దాన్ని బట్టే రెమ్యునరేషన్ పెమెంట్స్ జరుగుతాయి. ఎవరికీ వచ్చినట్లు వారు డిమాండ్ చేయడం, ఇవ్వడం జరగదు.. అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. ప్రస్తుతం అయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.