హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్‌‌: కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి

హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్‌‌: కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌‌లోని -అయోధ్యకు డైరెక్ట్‌‌ ఫ్లైట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 2న తొలి విమానం హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్తుందని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్, అయోధ్య మధ్యలో డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించాలని ఫిబ్రవరి 26న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు తాను లేఖ రాశానని వెల్లడించారు.

స్పందించిన సింధియా.. రెండు సిటీల మధ్య ఫ్లైట్స్‌‌ రాకపోకల కోసం కమర్షియల్ ఎయిర్‌‌లైన్స్ సంస్థలతో మాట్లాడారని తెలిపారు. ఆయన సూచన మేరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో శంషాబాద్‌‌ నుంచి అయోధ్యకు ఫ్లైట్‌‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.