డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు రూ. 15.60 లక్షల కోట్లు

డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు రూ. 15.60 లక్షల కోట్లు

     బడ్జెట్‌‌‌‌‌‌‌‌ అంచనాల్లో 80 శాతం చేరుకున్నామన్న ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నికరంగా రూ.15.60 లక్షల కోట్ల రెవెన్యూ డైరెక్ట్ ట్యాక్స్ కింద వచ్చింది. బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో వేసుకున్న అంచనాలో 80 శాతాన్ని ఇప్పటికే చేరుకున్నామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డైరెక్ట్ ట్యాక్సెస్‌‌‌‌‌‌‌‌ (సీబీడీటీ) ప్రకటించింది. ట్యాక్స్ కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌ నిలకడగా వృద్ధి చెందుతున్నాయంది.  ప్రస్తుత  ఆర్థిక సంవత్సరంలోని ఈ నెల 10 నాటికి స్థూలంగా (గ్రాస్‌‌‌‌‌‌‌‌)  రూ.18.38 లక్షల కోట్లు వసూళ్లయ్యాయని, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది 17.30 శాతం వృద్ధికి సమానమని వెల్లడించింది. 

అదే నెట్‌‌‌‌‌‌‌‌ డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు 20 శాతం పెరిగి రూ.15.60 లక్షల కోట్లకు చేరుకున్నాయని పేర్కొంది. ఈ నెల 1 నాటికి రూ.   2.77 లక్షల కోట్లను రిఫండ్ కింద ప్రభుత్వం సెటిల్‌‌‌‌‌‌‌‌ చేసింది. డైరెక్ట్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లలో కార్పొరేట్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ట్యాక్స్  గ్రాస్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం  9 శాతం, పర్సనల్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ గ్రాస్  రెవెన్యూ 25.67 శాతం వృద్ధి చెందాయి.