శ్రీలీల మా బంధువే.. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన అనిల్

శ్రీలీల మా బంధువే.. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన అనిల్

లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) కీ రోల్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth kesari). నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil ravipudi) కాంబోలో వస్తున్న ఈ ఎమోషనల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల బాలకృష్ణకి కూతురిగా నటిస్తుడగా.. కాజల్ అగర్వాల్(Kajal agarwal) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. 

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషనా పనుల్లో వేగం పెంచేశారు మేకర్స్. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి శ్రీలీల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. శ్రీల్లెలకు ఆయన మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టేశాడు.. శ్రీలీల అమ్మగారు డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలులోని పొంగులూరు.  మా అమ్మగారి ఊరు కూడా అదే. డాక్టర్  స్వర్ణ తనకు అక్క అవుతుందని, ఆ లెక్కన శ్రీలీల నాకు కోడలు అవుతుందని అన్నారు. ఇక భగవంత్ కేసరి షూట్ సమయంలో అందరి ముందు డైరెక్టర్ గారు అని.. ఎవరూ లేనప్పుడు మామయ్య అని పిలిచేదని చెప్పుకొచ్చాడు అనిల్. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.