Premalu: ఆదిత్య హాసన్ డైలాగ్స్కి కుదాస్..ప్రేమలు మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసలు

Premalu: ఆదిత్య హాసన్ డైలాగ్స్కి కుదాస్..ప్రేమలు మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసలు

నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఫీల్ గుడ్ మూవీ ప్రేమలు.  మహా శివరాత్రి (మార్చి 8న) సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. ఫిబ్రవరి 9న మళయాలంలో రిలీజై యూత్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసిన ప్రేమలు..తెలుగు ఆడియన్స్కి కూడా సూపర్బ్ గా నచ్చేసింది. కాలేజీ కుర్రాళ్లు ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ చూడటానికి వెళ్తున్నారట. 

తాజాగా ప్రేమలు సినిమా తనకెంతో నచ్చిందని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)ప్రేమలు టీమ్ ని అభినందించారు. 'నిన్న రాత్రి తెలుగులో ప్రేమలు చూసాను, అద్భుతంగా ఉంది! అద్భుతమైన పాత్రలు మరియు డైలాగ్‌లతో అన్ని విధాలుగా ఆడియన్స్ని ఎంటర్ టైన్ చేసింది. ఈ సినిమా కోసం పనిచేసిన మేకర్స్ కి కుదాస్ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

Also Read :తొలి సినిమా హీరోయిన్తోనే పెళ్లి.. షాకిచ్చిన కిరణ్ అబ్బవరం

ఈ  ట్వీట్కి రాజమౌళి కుమారుడు కార్తీకేయ స్పందిస్తూ..చాలా ధన్యవాదాలు సార్!.మీ నుండి ఇంత మంచి కాంప్లిమెంట్ రావడం'. ఇప్పటికీ డైరెక్టర్ రాజమౌళి ప్రేమలు సినిమాపై తనదైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు తెలుగు వెర్షన్‍కు 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ అందించారు. అతడు రాసిన డైలాగ్స్ ట్రెండ్‍కు తగ్గట్టు ఆడియన్స్ ను భలే ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ (SS Karthikeya) దక్కించుకున్న విషయం తెలిసిందే.