ఎఫ్3 లో పూజా హెగ్డే ‘స్పెషల్ సాంగ్’

ఎఫ్3 లో పూజా హెగ్డే ‘స్పెషల్ సాంగ్’

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎఫ్ 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ట్యాగ్ లైన్ ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’కు తగ్గట్టే ఫ్రస్టేటెడ్ హస్బెండ్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా ‘ఫన్’టాస్టిక్ గా చూపించారు. ఇప్పుడు ఈ  సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 మూవీ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ తాజా వార్తను చిత్ర యూనిట్ బయటపెట్టింది. అదేంటంటే... ఎఫ్ 3 లో బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే  ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందని. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘ఈ సమ్మర్ మరింత వేడెక్కబోతుంది. ఎందుకో ఎవరైనా ఊహించగలరా?  ‘స్పెషల్ పార్టీ’ సాంగ్ చేయడానికి రావిషింగ్ బ్యూటీ పూజా హెగ్డే ఎఫ్ 3 యూనిట్ తో జాయిన్ అయ్యింది’ అంటూ పూజా హెగ్డే డ్యాన్స్ చేస్తున్న ఓ పోస్టర్ ని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. స్పెషల్ పార్టీ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ వేసిన ఓ భారీ సెట్ లో స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం. కాగా.. వచ్చే నెల (మే) 27న ఎఫ్ 3 మూవీ రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. 

మరిన్ని వార్తల కోసం...

‘పుష్ప’ మూవీ పాట పాడిన తమిళనాడు కలెక్టర్

రాజస్థాన్లో వింత వ్యాధి.. ఏడుగురు చిన్నారుల మృతి..