అవార్డులకు మనసుంటే పరుగెత్తుకుంటూ రావాల్సిందే: అనిల్ రావిపూడి

అవార్డులకు మనసుంటే పరుగెత్తుకుంటూ రావాల్సిందే: అనిల్ రావిపూడి

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా..దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి (Bhagavanth Kesari). శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి..పెద్ద సక్సెస్ అయింది. 

లేటెస్ట్ గా భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ..'అవార్డుల గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. నిజంగా వాటికి మనసుంటే పరుగెత్తుకుంటూ అద్భుతంగా నటించిన బాలయ్య దగ్గరకు, శ్రీలీల దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే, అవార్డు వచ్చే స్థాయి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏ అవార్డులైనా పర్వాలేదు, వాటికి మనసుంటే బాబు దగ్గరకు పరుగెత్తుకుంటూ రావాల్సిందే..అంటూ తన మనసులోని మాటను చెప్పేశారు. 

అంతేకాకుండా..బాలయ్య ఏ క్షణంలో పిలిచిన..ఆయనతో మరో సినిమా చేయడానికి ఎప్పుడైనా రెడీ అంటూ ప్రకటించాడు అనిల్. సినిమాలో బాలయ్యకు తొడకొట్టే సీన్ లేదని కొందరు విమర్శించారని, బాలయ్య తొడ కొట్టాల్సిన అవసరం లేదని, ఇంత సక్సెస్ అందుకున్న తమ నిర్మాతలు తొడ కొడతారంటూ వేదికపై నిర్మాతలతో తొడ కొట్టించాడు అనిల్ రావిపూడి. దీంతో ఈ పవర్ఫుల్ కాంబోలో మరో సినిమా వచ్చే అవకాశం ఉంది. 

ప్రతి ఇంట్లో ఓ తండ్రికి బిడ్డకు మధ్య ఉండాల్సిన అందమైన భావోద్వేగానికి..అందరూ కనెక్ట్‌ అయ్యారు.ఆడపిల్లను సింహంలా పెంచాలనే మంచి సందేశం జనాల్లోకి తొందరగా వెళ్లింది.