వెండితెరపై సచిన్, వినోద్ కాంబ్లీ లైఫ్.. దర్శకుడిగా ప్రేమకథల స్పెషలిస్టు

వెండితెరపై సచిన్, వినోద్ కాంబ్లీ లైఫ్.. దర్శకుడిగా ప్రేమకథల స్పెషలిస్టు

క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), వినోద్ కాంబ్లీ(vinod kambli) ల జీవితంపై ఒక సినిమా రానుంది. క్రికెట్ అంటే ప్రాణంగా భావించిన ఇద్దరి కథగా ఈ సినిమా రానుంది. ప్రేమకథలకు స్పెషలిస్టుగా భావించే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. దీంతో ఇండియన్ క్రికెట్ లవర్స్ అండ్ మూవీ లవర్స్  ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి అనౌన్స్మెంట్ తోనే అంచనాలు పెంచేస్తున్న ఈ ప్రాజెక్టు గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. 

తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautham Vasudev Menon). సెన్సిబుల్ సినిమాలు తీయడంలో ఈయన రూటే వేరు. భావోద్వేగాలతో ఆడియన్స్ మనసులు గెలుచుకోవడం ఈ దర్శకుడికి అలవాటే. అందులో భాగంగా వచ్చినవే.. ఏ మాయ చేశావే, ఎటో వెళ్ళిపోయింది మనసు, సూర్య సన్ అఫ్ కృష్ణన్ సినిమాలు. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ధ్రువ నక్షత్రం. చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు గౌతమ్ మీనన్ తన తరువాతి సినిమాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

“నా తరువాతి సినిమా క్రికెట్ నేపథ్యంలో ఉంటుంది. ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు సచిన్, వినోద్ కాంబ్లిల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను, పాత్రలను రాసుకున్నాను. క్రికెట్ అంటే పిచ్చిగా భావించే ఇద్దరు ఫ్రెండ్స్, వారి జీవితాల్లో జరిగిన ఎమోషనల్ జర్నీని కథగా మార్చి ఈ సినిమా తీస్తున్నాను.. అని చెప్పుకొచ్చారు గౌతమ్ మేనన్. ఈ న్యూస్ విన్న సినీ అండ్ క్రికెట్ లవర్స్ హ్యాపీగా ఫీల అవుతున్నారు. సినిమా ఎప్పుడు వస్తుంది సర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో? ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read :-మానసికంగా, శారీరకంగా ఎన్నో.. బయటకు రావడానికి 15 రోజులు పట్టింది