అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే..

అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే..

కమెడియన్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌ ప్రధాన పాత్రలో ఎస్‌‌‌‌జే శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌‌‌‌’. వైవా హర్ష టైటిల్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తుండగా కృష్ణభగవాన్‌‌‌‌, షైనింగ్‌‌‌‌ ఫణి, కేజీఎఫ్‌‌‌‌ గరుడరామ్‌‌‌‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌‌‌‌ ఆచారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన  ట్రైలర్, ఫస్ట్ సాంగ్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి  సెకండ్ సాంగ్‌‌‌‌ను దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.

‘డే అండ్ నైట్ కలలే కన్నా  లైఫ్ ఏం అవుతుందో.. ట్రాకే తప్పి తిరిగే  రైలు ఎటువైపెళుతుందో.. అదృష్టం ఎదురొస్తే షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే.. దురదృష్టం డ్యాష్ ఇచ్చి పడదోసిందయ్యో..  అయ్యో ఏమీరా ఈ జీవితం’ అంటూ సాగే పాటను వికాస్ బడిస కంపోజ్ చేయగా, విష్ణు వర్ధన్ క్యాచీ లిరిక్స్ అందించాడు.  రాహుల్ సిప్లిగంజ్ పాడిన తీరు ఆకట్టుకుంది.

ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ ‘ఇదొక యూత్‌‌‌‌ఫుల్‌‌‌‌ సాంగ్‌‌‌‌. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.  సినిమాలో  ప్రతి సన్నివేశం ఆడియెన్స్‌‌‌‌కు థ్రిల్లింగ్‌‌‌‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది’ అని చెప్పాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని నిర్మాతలు చెప్పారు.