హనుమకొండ జిల్లాలో సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలి : డైరెక్టర్ ఆఫ్ హెల్త్ బి.రవీంద్రనాయక్

హనుమకొండ జిల్లాలో సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలి : డైరెక్టర్ ఆఫ్ హెల్త్ బి.రవీంద్రనాయక్

హనుమకొండ, వెలుగు: జిల్లాలో సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలని, పీహెచ్సీ డాక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని డైరెక్టర్ ఆఫ్​ హెల్త్​ బి.రవీంద్రనాయక్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని కడిపికొండ పీహెచ్​సీని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్, ఫార్మసీ, ఇతర విభాగాలను పరిశీలించారు. అనంతరం హనుమకొండ డీఎంహెచ్​వో ఆఫీస్ లో సీజనల్ వ్యాధులపై ప్రోగ్రాం ఆఫీసర్లతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా డీహెచ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్​వైజర్లు ప్రజలకు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. టీబీ, లెప్రసీ, ఎన్సీడీ కార్యక్రమంలో గుర్తించిన బాధితులకు తగిన చికిత్స అందించడంతోపాటు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు మున్సిపల్, పీఆర్, ఆర్ డబ్ల్యూఎస్ విభాగాల కోఆర్డినేషన్ తో పనిచేయాలన్నారు. బీపీ, డయాబెటిస్ పేషెంట్లకు తగిన సేవలందించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్​వో అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్వో, ఇన్చార్జి మలేరియా ఆఫీసర్ డా.టి.మదన్మోహన్ రావు, డీఐవో డా.మహేందర్, టీబీ కంట్రోల్ ఆఫీసర్ డా.హిమబిందు, ప్రోగ్రాం ఆఫీసర్లు  తదితరులున్నారు.