పీహెచ్​సీల్లో డాక్టర్ల నియామకం రెండు వారాల్లో పూర్తి చేస్తం: డీహెచ్

పీహెచ్​సీల్లో డాక్టర్ల నియామకం రెండు వారాల్లో పూర్తి చేస్తం: డీహెచ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పీహెచ్​సీల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. రెండు వారాల్లో డాక్టర్ల నియామకం పూర్తవుతుందన్నారు. ఈ మేరకు పీహెచ్​సీల్లో డాక్టర్ల కొరతపై ‘పేరుకే పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలు’ శీర్షికతో వెలుగులో వచ్చిన వార్తపై ఆయన స్పందించారు. పీహెచ్​సీల్లో 751 మంది డాక్టర్ల నియామక ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్నారు. 1,529 పల్లె దవాఖాన్లలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, మిడ్ లెవల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ల నియామకం కూడా ఈ వారంలో పూర్తవుతుందని తెలిపారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, 3నెలలకు సరిపడా స్టాక్ నిల్వ ఉందని వివరించారు. అక్టోబర్ లో అన్ని పీహెచ్​సీల్లో కలిపి 2,910 డెలివరీలు జరిగాయన్నారు. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. టెస్టులు అవసరమైన వారి వద్ద శాంపిల్స్ తీసుకుని టీ డయాగ్నోస్టిక్​ హబ్స్‌‌‌‌‌‌‌‌కు పంపిస్తున్నామన్నారు. పీహెచ్‌‌‌‌‌‌‌‌సీల బలోపేతానికి అన్నిరకాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, 43 పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలకు కొత్త బిల్డింగులను ఇటీవలే మంజూరు చేసిందని వెల్లడించారు.