Prashanth Reddy: కాలేజ్ బంక్ కొట్టి షూటింగ్కి వెళ్తే.. ఒకరోజు రాజమౌళి గుర్తుపట్టారు

Prashanth Reddy: కాలేజ్ బంక్ కొట్టి షూటింగ్కి వెళ్తే.. ఒకరోజు  రాజమౌళి గుర్తుపట్టారు

కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి(Prashanth reddy) తెరకెక్కిస్తున్న మూవీ భజే వాయువేగం(Bhaje Vayuvegam). యంగ్ హీరో కార్తికేయ(Karthikeya) హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్(Aishwarya menon) హీరోయిన్ గా నటిస్తున్నారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా.. రాధన్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా  మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తన మొదటి సినిమా గురించి చాలా విశేషాలు చెప్పుకొచ్చాడు.

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మాది మెదక్. నాకు చిన్నప్పటినుండి సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో రాజమౌళి గారు చేసిన సై సినిమా షూటింగ్ మెదక్ లో జరిగింది. కాలేజ్ బంక్ కొట్టి రోజు ఆ షూటింగ్ వద్దకు వెళ్ళేవాడిని. ఒకరోజు రాజమౌళి గారు గుర్తుపట్టి కాలేజ్ బంక్ కొట్టి వస్తున్నావా అని అడిగారు. అది నాకు ఇంకా గుర్తుంది. ఆయన ఇన్స్పిరేషన్ తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. యూవీ సంస్థలో రన్ రాజా రన్ నుండి ఇప్పటివరకు డైరెక్షన్ డిపార్టుమెంటులో చేస్తూ వచ్చాను. ఇప్పుడు భజే వాయువేగం సినిమాతో దర్శకుడిగా మారాను. అయితే రాజమౌళిని ఇప్పటివరకు కలవలేదని, సినిమా సక్సెస్ అయ్యాక కలుస్తానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.