
నారప్ప వంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీకీ "పెద కాపు1(peda kapu). రూరల్ అండ్ పొలిటికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీతో విరాట్ కర్ణ(Virat karna) హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ పెద కాపు మూవీపై అంచనాలు పెంచేసింది.
భీకరమైన హింసతో..అధిపత్యపు పోరుతో..ఆత్మ గౌరవ యుద్ధంతో ట్రైలర్ ఇంటెన్సివ్ గా ఉంది. యాక్టర్ తనికెళ్ళ భరణి..ఈ ఊరిలో రెండు వర్గాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో నలిగిపోయిన ఆడవాళ్ళ జీవితాలను వివరిస్తూ..ఒక ఆడదాని ఉచ్చులో పడి ఆకాశం తప్పా..ఆదుకునే వాడు లేక, అరిస్తే వినిపించుకునే వాడు లేక వెళ్లిపోయింది..ఇలాంటివి ఒకటి కాదు,వంద కథలు ఉన్నాయంటూ..నాగబాబుకు చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది.
బతికుండాగానే మట్టిలో పూడ్చేసే ఇద్దరు నాయకుల మధ్య..ఒక సామాజిక వర్గంలో నలిగిపోయిన ఓ యువకుడి కథ ఇదని తెలుస్తోంది.అలాగే..మనిషిలో కసి తగ్గినా.. కనికరం పెరిగినా..ఆడు మనోడైనా, పరాయి వాడైనా.. అనే డైలాగ్‌తో శ్రీకాంత్ అడ్డాల తన మాస్ రోల్ లో మెప్పిస్తున్నాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యాక..శ్రీకాంత్ అడ్డాల విలన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు ఆడియన్స్.
మేకర్స్. మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కే స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన పాటలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఫైట్ మాస్టర్ మాస్టర్ పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
ఈ మూవీలో నాగబాబు(Nagababu), తనికెళ్ల భరణి, రావు రమేశ్(Rao Ramesh), రాజీవ్ కనకాల(Rajeev kanakala), ఈశ్వరీ(Eshwari), అనసూయ(Anasuya) కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. నిర్మాత, మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 29 న రిలీజ్ కాబోతుంది.