శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూతో ‘అరి’ పోస్టర్స్‌ చించేయడం బాధనిపించింది.. డైరెక్టర్ జయశంకర్

శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూతో ‘అరి’ పోస్టర్స్‌ చించేయడం బాధనిపించింది.. డైరెక్టర్ జయశంకర్

వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన చిత్రం ‘అరి’. రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి,  డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ తెలియజేసేందుకు మంగళవారం సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ ‘సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. స్లోగా ఓపెనింగ్స్‌ వచ్చి పికప్ అవుతుందని ముందే ఊహించాం. శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూతో పోస్టర్స్‌ చించేయడం చూసి బాధనిపించింది. ఆ వివాదం సద్దుమణిగాక థియేటర్స్‌లో ప్రేక్షకుల సందడి కనిపించింది.

అరిషడ్వర్గాల గురించి ఎంతోమంది చర్చించారు కానీ వాటికి పరిష్కారం చూపించలేదు. ఆ ఆలోచనతోనే ఈ సినిమా తీశాం. థియేట్రికల్ రన్ పూర్తయ్యాకే సినిమా ఓటీటీ డేట్‌ను అనౌన్స్‌ చేస్తాం. అలాగే ఈ సినిమా కథతో త్వరలో ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్నాం’ అని చెప్పారు.

నటుడు వినోద్ వర్మ మాట్లాడుతూ ‘‘పేపర్ బాయ్’ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు జయశంకర్... ఈ చిత్రంలో లీడ్ రోల్ ఇచ్చి మరింత గుర్తింపు వచ్చేలా చేశారు. మా నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’ అని అన్నారు.  

ఇటీవలే, శ్రీకాంత్ అయ్యంగార్, మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, జనరల్ సెక్రటరీ శివ బాలాజీలను కలిసి కంప్లెయింట్ చేశారు.