మంత్రి సబితతో ముగిసిన నిజాం విద్యార్థుల చర్చలు

మంత్రి సబితతో ముగిసిన నిజాం విద్యార్థుల చర్చలు

మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నిజాం కాలేజీ విద్యార్థుల చర్చలు ముగిశాయి. హాస్టల్ కేటాయింపు విషయంలో ఓయూ వీసి, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ పై మంత్రి సబితా సీరియస్ అయ్యారు. అప్లై చేసుకున్న విద్యార్థులు అందరికీ హాస్టల్ కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సబితా హామీ ఇచ్చారు. 

మంత్రి ఆదేశాల ప్రకారం మరికాసేపట్లో విద్యార్థులతో.. కాలేజీ ప్రిన్సిపాల్ సమావేశం కానున్నారు. ప్రిన్సిపాల్‭తో చర్చించిన తరువాత విద్యార్థులు తమ నిర్ణయం చెబుతామని వెల్లడించారు. మరోవైపు.. విద్యార్థుల ఆందోళన గత కొద్ది రోజులుగా కొనసాగుతూనే ఉంది. విద్యార్థుల ఆందోళనకు ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఇప్పటివరకు పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ.. తమకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.