మునుగోడు బీఆర్ఎస్‌‌‌‌లో ముసలం .. సంస్థాన్​నారాయణ్​పూర్​ ఎంపీపీ గుత్తా ఉమాపై వేటు

మునుగోడు బీఆర్ఎస్‌‌‌‌లో ముసలం .. సంస్థాన్​నారాయణ్​పూర్​ ఎంపీపీ గుత్తా ఉమాపై వేటు
  • పార్టీ నుంచి సస్పెన్షన్​, వెంటనే రాజీనామా చేసిన ఎంపీపీ
  • ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు
  • ఎంపీపీ బాటలోనే మరికొందరు అసమ్మతి నేతలు

నల్గొండ, వెలుగు : మునుగోడు బీఆర్ఎస్​లో ముసలం మొదలైంది.  సంస్థాన్​నారాయాణ పురం​ఎంపీపీ గుత్తా ఉమాదేవి ఆదివారం పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సస్పెండ్​చేయడంతో అసమ్మతి నేతలు కోపంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరైనా గొతెంత్తితే పార్టీ నుంచి గెంటేస్తామనే సంకేతాలు ఇవ్వడంతో.. అందరూ ఒక్కతాటిపైకి వస్తున్నారు. కూసుకుంట్ల తీరు నచ్చని వీళ్లు... ఉప ఎన్నికల సమయం నుంచి వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో మంత్రులు జగదీశ్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ జోక్యం చేసుకోవడంతో పార్టీ కోసం పనిచేశారు. గెలిచాక ఎమ్మెల్యే అలాగే వ్యవహరించడంతో దూరంగా ఉంటున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సభకు కూడా హాజరు కాలేదు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడం లేదు. కాగా, ఎంపీపీ, జడ్పీటీసీలు లోకల్ ప్రజాప్రతినిధులను ప్రచారంలో పాల్గొననివ్వడం లేదని,  అందుకే ఎంపీపీని సస్పెండ్ చేసినట్ల ఎమ్మెల్యే వర్గం 
చెబుతోంది. 

తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం...

మునుగోడులో జరిగిన సీఎం ఆశీర్వాద సభకు 54 మంది సర్పంచ్​లు, 32 మంది ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు 35 మంది వరకు గైర్హాజరయ్యారని అసమ్మతి వర్గం చెబుతోంది. ఇందులో ఎంపీపీ, జడ్పీటీసీలు కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్లలో కొందరు ఉప ఎన్నికలప్పుడు బీఆర్ఎస్​లో చేరారు. ఆ సమయంలో మును గోడు, చౌటుప్పుల్, మర్రిగూడ, నాంపల్లి మండలాలకు చెందిన పలువురు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీపీ, జడ్పీటీసీలు కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని అంగీకరించలేదు.

దీంతో వారిని  దారికితెచ్చుకునేందుకు మంత్రులు జగదీశ్​ రెడ్డి, కేటీఆర్​ రంగంలోకి దిగి సెట్ చేశారు.  కానీ, బైపోల్‌‌‌‌లో గెలిచిన కూసుకుంట్ల మళ్లీ పాత పద్ధతిలోనే తమ పైనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని కొన్నాళ్లుగా వారు ఆరోపిస్తున్నారు.  ఇందులో భాగంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి కొడుకు అమిత్​ రెడ్డితో రాజకీయంగా టచ్‌‌‌‌లో ఉంటున్నారనే కారణంగా నారాయణపురం​ఎంపీపీ గుత్తా ఉమాదేవిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నోటీసులు కూడా ఇప్పించారని చెబుతున్నారు. ఈ విషయంలో ఎంపీపీ కోర్టును ఆశ్రయించారు. అయినా తగ్గని ఎమ్మెల్యే తాజాగా పార్టీ నుంచి సస్పెండ్​ చేయించారని మండిపడుతున్నారు.

కాంగ్రెస్​లో చేరేందుకు రంగం సిద్ధం..!

ఈ ఎన్నికల్లో కూసుకుంట్లను మార్చాలని అసమ్మతి వర్గం డిమాండ్​ చేసింది. బైపోల్​అప్పుడే టికెట్ మరోనేతకు ఇవ్వాలని పట్టుబట్టారు. టికెట్​ కో సం పలువురు ఆశవాహులు కూడా ప్రయత్నించారు. కానీ పార్టీ సర్వేల్లో కూసుకుంట్ల పేరు ఫస్ట్​ రావడం, ఆయనకు ప్రత్యామ్నయంగా మరో లీడర్​ లేకపోవడంతో హైకమాండ్‌‌‌‌ కూసుకుంట్ల వైపే మొగ్గు చూపింది. మళ్లీ ఆయనకే ఛాన్స్​ ఇవ్వడంతో అసమ్మతి నేతలు పార్టీ కా ర్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్లు పాల్గొనడం లేదు. ఎంపీపీ ఉమాను సస్పెండ్​ చేయడంతో ఆదివారం అసమ్మతి నేతలు భవిష్యత్‌‌‌‌ కార్యచరణ గురించి చర్చలు జరిపారు. నాంపల్లి​, చౌటుప్పుల్​, మునుగోడు, నారాయా ణ్​పూర్​, మర్రిగూడ మండలాలకు చెందిన పలువురు ముఖ్య ప్రజాప్రతిని ధులు త్వరలో కాంగ్రెస్​ చేరుతారని ప్రచారం జరుగుతోంది. 

ఎమ్మెల్యే కూసుకుంట్ల మానసిక రోగి

సంస్థాన్ నారాయణపురం, వెలుగు: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదని, అతన్ని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలని ఎంపీపీ గుత్తా ఉమాదేవి కామెంట్ చేశారు.  ఆదివారం పార్టీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ తమ కుటుంబాన్ని ఎమ్మెల్యే రాజకీయంగా, ఆర్థికంగా వేధింపులకు గురిచేశారని, ఆయనకు మునుగోడు మహిళల ఉసురు తగులుతుందని  శాపనార్థాలు పెట్టారు.  

ALSO READ : వామ్మో.. ఢిల్లీ గాలి .. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని

ఉప ఎన్నికల్లో వంద మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, సీనియర్‌‌‌‌‌‌‌‌ నాయకులు కష్టపడడంతో పాటు వామపక్ష పార్టీ ఓట్లు తోడుకావడంతో కొద్దిపాటి మెజార్టీతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు బయటపడ్డారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా హైకమాండ్ మానసిక రోగి అయిన కూసుకుంట్ల టికెట్ ను రద్దుచేసి నిజమైన పార్టీ కార్యకర్తకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ప్రజా ప్రతినిధులపైనే కక్ష సాధింపుగా అవిశ్వాసాలు పెట్టించిన దుర్మార్గుడు కూసుకుంట్లను  ఓడించడమే తమ లక్ష్యమని  వెల్లడించారు. అనంతరం బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీపీ గుత్తా ఉమాదేవి, ఆమె భర్త ప్రేమ్చందర్ రెడ్డి ప్రకటించారు.