ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాసం ఓటింగ్ తిరస్కరణ

ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాసం ఓటింగ్ తిరస్కరణ
  • ​​​​​​ఎన్నికలకు రెడీ కావాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపు

ఇస్లామాబాద్: పాకిస్థాన్  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయన పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ను తిరస్కరించారు నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరీ. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్  రాజ్యాంగ విరుద్ధమన్నారు డిప్యూటీ స్పీకర్. సభను నిరవధిక వాయిదా వేశారు. కుట్ర జరుగుతోందనే కారణాన్ని చూపిస్తూ.. పాకిస్థాన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని..తీర్మానాన్ని తిరస్కరించనట్లు తెలిపారు. దీంతో.. సభలో ప్రతిపక్షాలు రాసాభాస సృష్టించాయి.  
మరోవైపు నేషనల్ అసెంబ్లీకి ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. కాగా..చివరి నిమిషంలో స్పీకర్ అసద్ ఖైసర్ పైనా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో.. ఖాసీం ఖాన్ సభకు అధ్యక్షత వహించారు. మరోవైపు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి మాట్లాడుతూ జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని పాక్ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు తెలిపారు.  ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలన్నారు. ఎన్నికలకు పాక్ ప్రజలు రెడీ కావాలన్నారు ఇమ్రాన్ ఖాన్.

పాక్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది 

పాకిస్థాన్ రాజకీయాల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయని.. తమ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంలో ఓడిపోతే ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని.. ఆయనపై దేశద్రోహం కేసులు నమోదు చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయని ఆయన ఆరోపించారు. 

 

ఇవి కూడా చదవండి

పబ్‎లో ప్రముఖులు.. లైవ్ అప్‎డేట్స్

నిహారిక, రాహుల్ సిప్లిగంజ్కు నోటీసులు

కానిస్టేబుల్ పై దాడి చేసిన ఎద్దు