నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఊరూరా ఇందిరమ్మ చీరల పంపిణీ పండుగలా జరిగింది. ఐకేపీ ఏపీఎంలు, సీసీలు, వీఏవోలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చీరలు అందజేశారు. పంపిణీ చేసేటప్పుడు ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్ భీంగల్ మండలంలోని రహత్‌నగర్‌లో మహిళలకు చీరలు అందించారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి జిల్లావ్యాప్తంగా జరిగిన చీరల పంపిణీని పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. జిల్లాకు 2.57 లక్షల చీరలు వచ్చాయని సోమవారం మరో 50 వేలు రానున్నాయని కలెక్టర్ తెలిపారు.
మాచారెడ్డి మండల కేంద్రంలో
కామారెడ్డి: మహిళల ఆత్మగౌరవానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. ఆదివారం మాచారెడ్డి మండల కేంద్రంలో మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. కోటి మంది మహిళలకు చీరలు అందిస్తామన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికి బొట్టు పెడుతూ లబ్ధిదారులకు చీరలను అందజేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన చీరలు నాసిరకంగా ఉండేవని, కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యతతో కూడిన చీరలను అందిస్తుందన్నారు. దేశంలో రాజకీయ శూనత్య ఏర్పడినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పండుగలా చీరల పంపిణీ
సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోట్, చిన్న వాల్గోట్, రావుట్ల, తాళ్ల రామడుగు, సిరికొండ తదితర గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ చీరల పంపిణీ పండుగలా సాగింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా అనే క సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్మండలాధ్యక్షుడు బాకారం రవి, జిల్లా కార్యదర్శి ఎర్రన్న, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, లీడర్లు దేగం సాయన్న, రాము, ముషీర్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రూర్ లో నేడు చీరల పంపిణీ
వర్ని : రుద్రూర్ మండలంలో సోమవారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం బస్వంత్ తెలిపారు. ఈకార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
