భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బాలికలపై అత్యాచారాలను పొక్సో చట్టం నిరోధించలేకపోతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ వాపోయారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించిన న్యాయవాద వృత్తి, నైపుణ్య శిక్షణా తరగతులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాచారాల నిరోధక చట్టం కింద అనేక మంది నిందితులకు న్యాయ స్థానాలు కఠిన శిక్షలు విధిస్తున్నప్పటికీ అత్యాచారాలు ఆగడం లేదన్నారు. కొత్త చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.
మేజర్ చట్టాల అమల్లో సందేహాలు తలెత్తుతున్నాయని, అవి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రోగ్రాంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎంవీ ప్రసాదరావు, జిల్లా కార్యదర్శి రమేశ్ కుమార్ మక్కడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు మూర్తి, శివరాం ప్రసాద్, కిషన్‌రావు, పురుషోత్తమరావు, అన్నపూర్ణ, సుడిగాలి వెంకట నర్సయ్య, అరుణ్, శ్రీనివాసరావు, చైతన్య పాల్గొన్నారు.